Sunday, December 22, 2024

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి…

- Advertisement -
- Advertisement -

Raised gas prices should be brought down immediately

హైదరాబాద్: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోతారోహిత్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. నగరంలోని విద్యానగర్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ సిలిండర్ నమూనాలో తయారు చేసిన కేక్ కట్ చేసి ప్రజలకు, ప్రయాణీకులకు పంచి నిరసన వ్యక్తం చేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో 410 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంటే ఆందోళన చేసిన ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు 1105 రూపాయలు ఉంటే మాటలు రావట్లేవా అని మోతారోహిత్ ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజల నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతుందని ఆరోపించారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాలుగా తాము చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News