Sunday, January 5, 2025

కేంద్రం ప్రతిస్పందిస్తుందనుకుంటే… నాపై దాడి జరిగింది: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శాంతిభద్రతల విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిష్క్రియగా వ్యవహరిస్తుండడంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. క్రిమినల్స్ పై చర్య తీసుకోడానికి బదులు నవంబర్ 30న మాల్వియ నగర్ లో నాపై దాడి జరిపించారు. ఆరోపణలపై బిజెపి ఇంకా ప్రతిస్పందించాల్సి ఉంది. కేంద్రం ప్రతిస్పందిస్తుందని భావించి నేను సమస్యలు లేవనెత్తాను. కానీ చివరికి నా మీదే దాడి జరిగిందని కేజ్రీవాల్ అన్నారు.

కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘నా మీద జల్లిన ద్రవం నిరపాయకరమైనది, కానీ అది ప్రమాదకరమైనదయి ఉండేది. గత 35 రోజుల్లో ఇది నాపై జరిగిన మూడో దాడి’’ అన్నారు. అపరాధం చేసే వారి కంటే ఫిర్యాదుదారులే అరెస్టు ఎదుర్కోవలసి వస్తుందన్న సందేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇస్తున్నారని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News