Wednesday, January 22, 2025

భద్రంగా పెంచారు.. అడ్డంగా నరికారు

- Advertisement -
- Advertisement -

సంగెం: హరితహారంలో భాగంగా మండలంలోని కాపులకనపర్తి గ్రామంలో వరంగల్‌నెక్కొండ ప్రధాన రోడ్డుకు మొక్కలు నాటారు. ఆ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుచూపు కొరవడడంతో విద్యుత్ లైన్ల కిందనే మొక్కలు నాటారు. గ్రామపంచాయతీ పర్యవేక్షణలో రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు పందిరిగా మారాయి. వరంగల్ వెళ్లే ప్రయాణికులకు ఈ రోడ్డు మార్గంలో వెళ్లే వారికి చల్లటి నీడను అందించేవి. అనువంత భూమి లేకుండా చేశారు.

ఏపుగా పెరిగిన చెట్లు విద్యుత్ తీగలకు తగిలి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, దారి పొడవుగా ఏపుగా పెరిగిన చెట్లను శనివారం అడ్డంగా నరికి వేశారు. దీంతో ఇప్పుడు ఆ రోడ్డు మోడు బారిపోయింది. ఏపుగా పెరిగి చెట్లను నరికివేయడంతో స్థానికులు అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం వల్లనే విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటడం వల్ల అవి ఏపుగా పెరగడంతో వాటిని నరికి వేయడం వల్ల ప్రజా ధానం వృథా అవుతుందని, దానికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News