Wednesday, January 22, 2025

పన్నుల భారం లేకుండా నిధుల సమీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల సమస్త అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం చేసే ఖర్చులు ఉండాలని, అంతేగాక ప్రభుత్వ పరంగా ఆస్తులను సృష్టించి తద్వారా ఆదాయాన్ని పెంచుకొని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి ఖర్చు చేసే వి ధంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థ్ధిక, విద్యుత్తుశాఖల మంత్రి భట్టి విక్రమార్క ఉ న్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణను ప్రజాస్వామిక, సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్రజాపాలన లక్షమని ఉప ముఖ్యమంత్రి గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన బడ్జెట్ సమీక్షా సమావేశంలో సీనియర్ అధికారులకు వివరించారు.

2024-25వ ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు శాఖల వారీగా చేపట్టిన సమీక్షా సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ స మావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉప ము ఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి అధికారు లు దృష్టిసారించాలని, ప్రజలకిచ్చిన హామీలను అమలు చే యడానికి అధికారులు చిత్తశుద్ధితో తమతో కలిసి పనిచేయాలని కోరారు. అయితే ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారాలను మోపకుండా, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా, 2024-25వ ఆర్థ్ధిక సంవత్సరంలో ఖర్చు చేయాల్సిన నిధులను సమీకరించుకోవడానికి వీలుగా ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే రెవెన్యూశాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

ఖజానాకు రెగ్యులర్‌గా వస్తున్న ఆదాయం సరిపోకపోతే ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వనరులను సమీకరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలేగానీ ప్రజలపై ఎలాంటి భా రాన్ని మోపకూడదని ఆర్ధిక మంత్రి స్పష్టంచేశారు. ఎంత కష్టమైనాసరే అధికారులు, ప్రభుత్వం కలిసి పనిచేసి ప్రజలకు మేలు చేయాలన్నారు. ప్రజలకు మేలు చేయడమే ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్షమని అన్నారు. ల్యాండ్ రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నటువంటి భూముల లీజుల గడువుదాటిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై దృష్టిసారించాలని డిప్యూటీ సీఎం రెవెన్యూశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ఆస్తులు కొద్దిమంది చేతుల్లో ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వ ఆస్తులు ప్రజలకే చెందాలని, ప్రజలకే ఉపయోగపడాలని ఆయన స్పష్టంచేశారు.

ధరణితో ప్రజల హక్కులను కాలరాశారు
ధరణి పథకం మూలంగా రాష్ట్రంలోని రైతుల హక్కు లు హరించివేయబడ్డాయని, అనేక కాలాలను తొలగించి రైతుల హక్కులను కాలరాశారని, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండకూడదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖాధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రతి సంవత్సరం జమాబందీ చేసేవారని గుర్తు చేశారు. 2014 తర్వాత ఆ వి ధానం పాటించకుండా సుమారు ఆరేళ్ల పాటు రెవె న్యూ సదస్సులు నిర్వహించకుండా జమాబందీని నిలుపుదల చేయడం మూలంగా అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడ్డారని ఉప ముఖ్యమంత్రి భట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ధరణి సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, మాన్యం, దేవాదాయ భూములే కాకుండా అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకొన్న చట్టాలతో వచ్చిన భూములను కూడా పార్ట్ ‘బి’లో పెట్టి ఆ రైతుల హక్కులను కాలరాసిందని ధ్వ జమెత్తారు. పార్ట్ ‘బి’లో ఉన్న భూములను క్లియర్ చేయడానికి కావాల్సిన వ్యవస్థ కూడా లేకుండా చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అధికారులకు వివరించారు.

ఇలా ధరణి మూలంగా ప్రజలకు సంబంధించిన భూములు కొం తమంది అధీనంలోకి వెళ్లాయని, అదే విధంగా ప్ర భుత్వ భూములు సైతం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి తీసుకునే విధంగా త గిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. 2014వ సం వత్సరం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ చేసి, పం పిణీ చేసిన భూముల వివరాలు, 2014 నుంచి 2024వ సంవత్సరం వరకూ గత ప్రభుత్వం వెనక్కు తీసుకొన్న భూములు… వాటిని ఏ అవసరాల కోసం వాడారు..? వెనక్కు తీసుకొన్న భూముల్లో మిగిలివున్న భూమి ఎంత..? అనే వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. అంతేగాక తాను పాదయాత్రలో ప్రజల నుంచి స్వీకరించిన అనేక విన్నపాల సారాంశాన్ని కూడా అధికారులకు కూలంకషంగా వివరించి గత ప్రభుత్వం ధరణిని ప్రయోగించి తీసుకొన్న భూముల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.

ప్రతి పోరాటమూ భూమి కోసమే
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అనేక పోరాటాలు, ఉ ద్యమాల చరిత్ర మొత్తం భూమికోసం జరిగినవేనని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థ్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు వివరించారు. 1945-1952 మధ్యన జరిగిన తెలంగాణ సాయుధ రైతాం గ పోరాటం, ఆ తర్వాత జరిగిన నక్సల్‌బరి ఉద్య మం, 1969 తెలంగాణ పోరాటం… ఇలా అనేక పోరాటాలు జరిగాయని, అవన్నీ భూమి కోసమే జరిగాయని, ఆ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వాలు చట్టాలు తెచ్చి టెనెన్సీ యాక్ట్, భూ సంస్కరణల చట్టంతో రైతులకు భూములపై హక్కులు కల్పించారని చెప్పారు. ఈ హక్కులను ధరణి పేరిట కాలరాయడం సరికాదన్నారు. 2004-2009 మధ్యన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్స్‌తో జరిపిన చర్చలు ప్రజా సంఘాల నాయకులు చేసిన 104 సిఫారసుల్లో 93 సిఫారసులు కోనేరు రంగారావు కమిటీ ద్వారా చట్టాలు చేసి భూమి సమస్యల పరిష్కారం కోసం సిసిఎల్‌ఎ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ప్రత్యేక అధికారులను నియమించినట్లుగా గుర్తు చేశారు. ఇలా ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలతో చేసిన చట్టాలతో భూమిపై ప్రజలు తెచ్చుకొన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీనియర్ అధికారులతో అన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ అధికారులకు కూలంకషంగా వివరించి వారిని కార్యోన్ముఖులను చేసేందుకు ఆయన భూ పోరాటాలను వివరించారు.

ఆపద్భందు, పిడుగుపాటుతో చనిపోయిన కుటుంబాలకు అందించే ఆర్ధిక సహాయానికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగంలోని పథకాలు, సిఎంఆర్‌ఎఫ్ పథకాలకు నిధులను కేటాయించకుండా గత ప్రభుత్వం నిలిపివేసిందని, ఇప్పటికీ అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని అధికారులు డిప్యూటీ సిఎంకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలలో తెలంగాణకు 1.50 లక్షల ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే నిధులు ఇచ్చిందని, 2023-24వ సంవత్సరంలో ఇళ్ల నిర్మాణ పథకానికి తాత్కాలికంగా బ్రేకులు వేసిందని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం తయారు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సిఎంకు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2లక్షల ఇళ్ల నిర్మాణాలకు గాను 67 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగతా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.

రైతు సంక్షేమ పథకాలకు నిధులకు ఢోకాలేదు : డిప్యూటీ సిఎం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సంక్షేమం చేపట్టిన పథకాలు, ఇప్పటికే అమలులో ఉన్న రైతులకు నిజంగా మేలు చేసే మంచి పథకాలకు నిధులకు ఎలాంటి ఢోకాలేదని డిప్యూటీ సిఎం, ఆర్ధిక శా ఖామంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు తమ ప్రభుత్వ అభిమతాన్ని వివరించారు. వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, మార్కెటింగ్, చేనేత, జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయా శాఖల సీనియర్ అధికారులతో బడ్జెట్ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.

రైతు బీమా, పంటల బీమా, రైతు బంధు, ఆయిల్‌ఫామ్ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్ళు, డ్రిప్ సాగులకు కేటాయించాల్సిన నిధులపై చర్చించారు. నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా సంపూర్ణంగా అరికట్టాలని, విత్తన తయారీలో ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ చీరెలు, విద్యార్ధులకు అందించే యూనిఫామ్ వస్త్ర తయారీ గురించి ఆరాతీశారు. 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి కావాల్సి బడ్జెట్ ప్రతిపాదనలను ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థ్ధికశాఖకు అందజేశారు. ఈ సమావేశంలో ఆర్థ్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News