Thursday, January 23, 2025

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేబినెట్ భేటీలో శుక్రవారం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ గురించి చర్చించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

2022 మే 6న జరిగిన వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. దానిని అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నది. రుణమాఫీ కోసం రూ. 31000 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News