Monday, January 20, 2025

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్న హైకోర్టు ఛీఫ్ జస్టిస్

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఇటీవలే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన అలోక ఆర్ధే ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
వివి స్టాట్యూ, మోనప్ప జంక్షన్ నుంచి పంజాగుట్ట మీదుగా గ్రీన్స్‌ల్యాండ్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదన్ నిరంకారీ వైపు మళ్లిస్తారు.
పంజాగుట్ట రోడ్డు నుంచి రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డును పూర్తిగా మూసివేస్తారు.
ఫార్కింగ్ ఏరియాలు….
గేట్ నంబర్ 3 అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద జడ్జిలు, ఎంపిలు,ఎమ్మెల్యేలు,ఎంఎల్‌సిలు వాహనాలను పార్కింగ్ చేయాలి.
దిల్‌కుషా గేస్ట్ హౌస్ వద్ద మీడియా వాహనాలు నిలుపాలి.
ఎంఎంటిఎస్ పార్కింగ్ లాట్‌లో పోలీసుల వాహనాలను పార్కింగ్ చేయాలి.
మెట్రో రెసిడెన్సీ నుంచి ఎన్‌ఎఎస్‌ఆర్ స్కూల్ రోడ్డు వైపు సింగిల్ లైన్‌లో విఐపిల వాహనాలను పార్కింగ్ చేయాలి.
వివి స్టాట్యూ జంక్షన్ వద్ద సింగిల్ లైన్‌లో పార్కింగ్ చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News