Thursday, January 16, 2025

శిల్పా శెట్టి ఆస్తుల జప్తు..ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేయం

- Advertisement -
- Advertisement -

ఆస్తుల జప్తు ఉత్తర్వుపై అపెల్లేట్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకునే వరకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు జారీ చేసిన నోటీసులపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని బాంబే హైకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం తెలియచేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి తాము జప్తు చేసిన ముంబైకి చెందిన జుహు ప్రాంతంలోని నివాసాన్ని, పుణెలోని ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ఆదేశిస్తూ శిల్పా శెట్టి, ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు సెప్టెంబర్ 27న ఇడి నోటీసులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వారిద్దరూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ జంట ఆస్తులను జప్తు చేస్తూ ఇడి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ఇడికి నోటీసులు జారీచేసింది. ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయవలసిన అత్యవసరం ఏమొచ్చిందని ఇడిని హైకోర్టు ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News