హద్దులను గౌరవించి అనవసర వ్యవహారాలలో తన భార్య, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేరును లాగవద్దని వ్యాపారవేత్త రాజ్ కుంద్రా శనివారం మీడియాకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాజ్ కుంద్రా నివాసంపై ఇడి దాడులు నిర్వహించింది. పోర్నోగ్రఫి, అశ్లీల సినిమాలను పంపిణీ చేశారన్న ఆరోపణలకు సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ కేసులో భాగంగా కుంద్రాతోపాటు మరి కొందరి ఇళ్లు, కార్యాలయాలలో ఇడి సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. తాను ఇడి దర్యాప్తునకు సహకరించడం లేదంటూ కొన్ని పత్రికలలో వచ్చిన కథనాలను కుంద్రా ఖండించారు.
గడచిన నాలుగేళ్లుగా జాగుతున్న ఈ కేసు దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. సహచరులు, ప్రోర్నోగ్రఫి, మనీ లాండరింగ్ వంటి ఆరోపణల విషయానికి వస్తే నిజాలను సంచలనాలు మరుగు పరచాలని, చివరకు న్యాయమే గెలుస్తుందని తన నివాసాలపై ఇడి దాడుల తర్వాత మొదటిసారి స్పందిస్తూ రాజ్ కుంద్ర తెలిపారు. సంబంధం లేని వ్యవహారాలలో తన భార్య పేరును పదేపదే లాగడం మీడియాకు తగదని ఆయన హితవు పలికారు. దయచేసి హద్దులను గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2009లో రాజ్ కుంద్రాను వివాహ ం చేసుకున్న శిల్పా శెట్టి దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది.