ముంబయి: నీలి చిత్రాల రాకెట్‌తో సంబంధం ఉన్న కారణంగా ముంబయి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రను జులైలో అరెస్టు చేసింది. అయితే ముంబయిలోని స్థానిక కోర్టు బిజినెస్‌మెన్ అయిన రాజ్‌కుంద్ర, ఆయన ఐటి హెడ్ రయాన్ తోర్పేలకు రూ. 50,000 పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది.బెయిల్ కోరే సందర్భంలో కుంద్రా ముంబయి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో నటుల సమ్మతితోనే తాను వీడియోలు తీశానని, అయితే తన మొబైల్ హాట్‌షాట్లన్ని కేవలం 10నెలలకే పరిమితమైనవని తెలిపాడు. కుంద్రా కంపెనీ(ఫర్మ్) పెద్దల చిత్రాలు, నీలి చిత్రాలు ఉన్న వీడియోలు అందించడానికి హాట్‌షాట్స్ మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది.
కుంద్రా నీలిచిత్రాల కేసులో పోలీసులు 1467 పేజీల అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. నటి శిల్పాశెట్టి సహా కనీసం 42 మందిని ప్రశ్నించారు. కుంద్రాను ముంబయి పోలీసులు ‘ముఖ్య సూత్రధారి’గా పేర్కొన్నారు. అంతేకాక అతడిపై ఐటి చట్టం, మహిళలను అశ్లీలంగా చూయించే(నిషిద్ధ) చర్యల నేరారోపణల సెక్షన్‌ల క్రింద అభియోగాలు మోపారు.
అశ్లీల సినిమాల కేసులో రాజ్ కుంద్రాకు బెయిలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -