- Advertisement -
ముంబై: ఫోర్నో వీడియోగ్రాఫీ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత రాజ్ కుంద్రా కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను జూలై 19 న క్రైమ్ బ్రాంచ్ ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తన పోలీసు రిమాండ్ ముగింపులో అతన్ని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతన్ని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కుంద్రా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. అతని ల్యాప్ ట్యాప్ లో డేటాపై మరింత లోతైన దర్యాప్తు చేయడానికి కస్టడీ పొడిగించాలని పోలీసులు కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. అటు ఈ కేసులో ఇడి కూడా త్వరలో దర్యాప్తు ప్రారంభించనుంది.
- Advertisement -