Tuesday, December 17, 2024

23 వరకు రాజ్‌కుంద్రాకు పోలీసు కస్టడీ

- Advertisement -
- Advertisement -

Raj Kundra sent to police custody till July 23

 

ముంబయి: అశ్లీల చిత్రాలను రూపొందించాడన్న ఆరోపణలపై అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను స్థానిక కోర్టు నెల 23 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. అతనితో పాటు రియాన్ థార్స్‌అనే వ్యక్తికి కస్టడీ విధించింది ఎస్‌ప్లనేడ్ కోర్టు. అంతకు ముందు ముంబయి పోలీసులు సోమవారం రాత్రి రాజ్‌కుంద్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోర్నోగ్రఫిక్ చిత్రాలను రూపొందించి వాటిని కొన్ని యాప్స్ ద్వారా అప్‌లోడ్ చేసేవారని రాజ్‌కుంద్రాపై ఆరోపణలున్నాయి. రాజ్‌కుంద్రాకు యాప్స్ లావాదేవీలు, వాటి కంటెంట్లతో సంబంధాలున్నాయని వెల్లడించే పలు వాట్సాప్ సంభాషణలున్నాయని పోలీసులు అంటున్నారు. అంతేకాక పోర్నోగ్రఫిక్ సినిమాల్లో బలవంతంగా నటించేలా చేసారంటూ ముగుగ్రు మహిళలు ఫిర్యాదులతో ముందుకు వచ్చారని కూడా పోలీసులు చెప్తున్నారు. పోర్నోగ్రఫిక్ చిత్రాలను రూపొందిస్తున్రాన్న ఫిర్యాదుపై గత ఫిబ్రవరిలో క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసుల విషయంలోనే రాజ్‌కుంద్రాను సోమవారం రాత్రి అరెస్టు చేశామని ముంబయి పోలీసు కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News