Monday, January 20, 2025

బాలికలను లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయుడు….. అరెస్టు

- Advertisement -
- Advertisement -

జైపూర్: బాలికలను వేధించడంతో రాజ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంఘటన రాజస్థాన్‌లో రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రమేష్ చంద్ర కటారా అనే టీచర్ రాజ్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వేసవి సెలవుల్లో ఆడుకోవడానికి స్కూల్‌కు బాలికలకు రమేష్ రమ్మని కబురు పంపాడు. స్కూల్ వచ్చిన విద్యార్థినులలో ఆరుగురితో అసభ్యంగా ప్రవర్తించడంతో వారి తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రమేష్ చంద్రకటారాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ను సస్పెండ్ చేశామని విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: అమెరికాలో 70 శాతం ఇళ్లకు వ్యాపించిన కోవిడ్-19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News