Saturday, December 21, 2024

వైజాగ్ నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

Raj tarun act in standup rahul

 

రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించన సినిమా ‘స్టాండప్ రాహుల్’. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 18న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్, పాటలను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ “కుటుంబ సమేతంగా చూసే సినిమా ఇది. అన్ని ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు”అని అన్నారు. దర్శకుడు శాంటో మాట్లాడుతూ “ఈ సినిమా కథ వైజాగ్ నేపథ్యంలో ఉంటుంది. రాజ్‌తరుణ్, వర్ష చక్కగా నటించారు”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News