హైదరాబాద్: పోకిరి సినిమా విడుదలై ఈ రోజుతో 18 ఏళ్లు అవుతోంది. దీంతో హీరో మహేష్ అభిమానులో పోకిరి సినిమాను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు తోడుగా ఇలియానా నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ మూవీలో డైలాగ్‌లు, వీడియో క్లిప్పింగ్ లు సామాజిక మాద్యమాల్లో మహేష్ అభిమానులు పోస్టులు పెడుతూ హల్‌చల్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాపై తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గోపాలపట్నంలోని శంకర థీయేటర్‌లో సినిమా చూశానని, కృష్ణ మనోహర్ ఐపిఎస్ సన్నివేశం సినిమాకు హైలెట్ నిలిచిందని కొనియాడారు. ఇప్పటికీ ఆ సినిమా తన కళ్ల ముందు కదులుతోందన్నారు. అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందని ఇండియాలో పోకిరి సెన్సేషనల్ రికార్డులు సృష్టించిందన్నారు. భారతీయ సినీ చరిత్రలో పోకిరి నిలిచిపోయిందని కొనియాడారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ పోస్టు ట్వీట్టర్‌లో వైరల్‌గా మారాయి.
ఇప్పటికీ ఆ సినిమా నా కళ్ల ముందు కదులుతోంది: రాజ్ తరుణ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -