టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హాసినీ సుధీర్ జంటగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్’ పతాకంపై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. ఇందులో ప్రకాష్ రాజ్, మురళీశర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాజా రవీంద్ర, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 26వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే..
కథః రామ్(రాజ్ తరుణ్) విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఇండియాకి వస్తాడు. ఆయన ఫ్యామిలీకి హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ కంపెనీకి సీఈవో ఎంపిక ఘట్టం జరుగుతుంది. రచిత్ రామ్ కి, తన పెదమ్మ (రమ్యకృష్ణ) కొడుకు మధ్య పోటీ నెలకొంటుంది. రామ్ విదేశాల్లో పెరిగిన నేపథ్యంలో ఇక్కడ విషయాలు తెలియవు, అవగాహన లేదు, ఇంత పెద్ద పోస్ట్ కి అర్హుడు కాడనే ప్రతిపాధన వస్తుంది. సీఈవో కావాలంటే వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ మనిషిలా బతకాలని, ఈ టైమ్ లో ఎవరూ తనని గుర్తించకూడని, ఒకవేళ అలా ఎవరైనా గుర్తిస్తే సీఈవో పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన రామ్ అన్నీ వదులుకుని తన ఇంటిని, కంపెనీ వదిలేసి వెళ్లిపోతాడు. వైజాగ్ ట్రైన్ ఎక్కి మధ్యలో ఓ మారుమూల గ్రామానికి చేరతాడు. అక్కడ అమ్ములు(హాసినీ సుధీర్) తనని మోటర్ సైకిల్ తో గుద్దుతుంది. దీంతో అపస్పారక స్థితిలో పడిపోయిన రామ్‌ని తన ఇంటికి తీసుకెళ్తుంది.
తనకు ఎవరూ లేరని, అనాథని అని చెప్పి ఆమె వద్ద వ్యవసాయం పనులు చేసేందుకు పనిలో చేరతాడు రామ్. ఈక్రమంలో అమ్ములతో ప్రేమలో పడతాడు. మరోవైపు ఈ ఊర్లో ఎక్కువగా పూలతోటల రైతులు ఉంటారు. మార్కెట్‌లో ఎమ్మెల్యే కొడుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుంటాడు. ఎదురుతిరిగినవారిని అంతం చేస్తుంటాడు. దీంతో వాళ్ల తరఫున నిలబడతాడు రామ్. అందుకోసం పెద్ద స్థాయిలో పోరాటం చేపడతాడు. మరి ఆ పోరాటం ఏంటి? రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాడు? మరి వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఉండాలనే నిబంధనని పాటించాడా? బ్రేక్ చేశాడా? చివరికి సీఈవో ఎవరు అయ్యారు? ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నాల పాత్రేంటనేది మిగిలిన కథ.
విశ్లేషణః
రాజ్ తరుణ్ సోలో హీరోగా సక్సెస్ కొట్టి చాలా ఏళ్లు అయ్యింది. నాగార్జున నా సామి రంగా`లో కీలక పాత్రలో పోషించి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు సోలో హీరోగా సక్సెస్ కొట్టేందుకు `పురుషోత్తముడు చిత్రంతో వచ్చాడు. తన కంపెనీ బాధ్యతలు చేపట్టాలంటే కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా సాధారణ మనిషిలా బతకడం, ఆ తర్వాత అత్యంత నాటకీయ పరిణామాల అనంతరం హీరో కంపెనీ బాధ్యతలు తీసుకోవడమనే కాన్సెప్ట్ తో, ఓ పెద్ద కంపెనీ అధినేత కొడుకు మామూలు పల్లెటూరికి వచ్చి, ఊరి ప్రజల కోసం అండగా నిలవడం వంటి కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.
శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమిందార్ వంటి సినిమాలు ఈ కాన్సెప్ట్ తో వచ్చినవే. అయితే స్క్రీన్ ప్లే పరంగా ‘పురుషోత్తముడు’ మెప్పిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రామ్ భీమన డైరెక్షన్, గోపిసుందర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ కె వెంకటేష్ ఎడిటింగ్.. అన్నీ బాగా కుదిరాయి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ లో వచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ మెప్పిస్తాయి. మొత్తానికి ‘పురుషోత్తముడు’ చాలా రోజుల తర్వాత వచ్చిన ఓ డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్. రాజ్ తరుణ్ ని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఈ వీకెండ్ కి థియేటర్లలో చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.
రేటింగ్: 3/5