Friday, November 15, 2024

బిజెపితో కూటమిలో రాజ్ థాక్రే?

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్) అధినేత, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తమ్ముని కుమారుడు రాజ్ థాకరే లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి-శివసేన(ఏక్‌నాథ్ షిండే) కూటమిలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శివసేన(యుబిటి) అధినేత ఉద్ధవ్ థాక్రే బాబాయ్ కుమారుడైన రాజ్‌థాక్రే సోమవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారని, అక్కడ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులేతో కలసి బిజెపి అధిష్టానంతో చర్చలు జరపనున్నారని వర్గాలు తెలిపాయి.

ఎంఎన్‌ఎస్ కోసం రెండు లోక్‌సభ నియోజకవర్గాలను ఆయన కోరుతున్నట్లు వారు చెప్పారు. దక్షిణ ముంబైతోపాటు షిర్డీ స్థానాలను రాజ్‌థాకరే ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. ఉద్ధవ్ థాకరేకు, రాజ్ థాకరేకు చాలా కాలంగా సత్సంబంధాలు లేవు. ఉద్ధవ్ థాకరే శివసేనకు చెందిన ఒక వర్గానికి సారథ్యం వహిస్తుండగా మరో వర్గానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం వహిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News