Monday, November 18, 2024

అంతరిక్షం లోకి మన రాజాచారి… నింగి లోకి దూసుకెళ్లిన ‘ క్రూ3 ’

- Advertisement -
- Advertisement -

Raja chari flies off to ISS on NASA
కేప్ కానవెరల్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ, ప్రైవేట్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ప్రయోగించిన ‘క్రూ3 ’ మిషన్ ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం రాత్రి 9 గంటలకు ఫ్లోరిడా లోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా నింగి లోకి దూసుకెళ్లింది. 22 గంటల ప్రయాణం తరువాత ఈ రాకెట్ లోని నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటారు. క్రూ9 మిషన్‌కు రాజాచారి కమాండర్‌గా వ్యవహరిస్తుండగా, ఆయనతోపాటు మిషన్ స్పెషలిస్టుగా అమెరికా నేవీ సబ్‌మెరైన్ అధికారి కేలా బారస్, నాసాకు చెందిన మార్ట్‌బర్న్ పైలట్‌గా , ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మత్తియాస్ మౌరర్ మిషన్ స్పెషలిస్టుగా వెళ్లారు. వీరు ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు.

భారతీయ అమెరికన్ అయిన రాజాచారి అమెరికా వైమానిక దళంలో కర్నల్ హోదాలో ఉన్నారు. ఆయన తండ్రి శ్రీనివాస్ వి. చారి హైదరాబాద్ నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వలస వెళ్లారు. అక్కడ అమెరికాకు చెందిన పెగ్గీ ఎగ్నర్ట్‌ను వివాహం చేసుకున్నారు. వారికి రాజాచారి 1977 లో జన్మించారు. విస్కాన్‌సిన్ లోని మిల్వాకీలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. యుఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.

ఆ తరువాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. యుఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లోనూ విద్యను అభ్యసించారు. 2017లో నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్‌కు ఎంపికయ్యారు. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం. ఇదిలా ఉండగా, చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ౧౮ ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ మిషన్ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అన్నీ సవ్యంగా జరిగితే 2024 లో రాజాచారి జాబిల్లిపై కాలు మోపే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News