Thursday, January 23, 2025

ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ నేత అరెస్టు

- Advertisement -
- Advertisement -

భోపాల్: ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు.

దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోడీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రధానిని చంపండి అన్న నా మాటలకు అర్థం… వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించండి అన్న ఉద్దేశ్యంతో చెప్పిందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఆయన వ్యాఖ్యలను బిజెపితో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News