Thursday, January 23, 2025

‘చోళుల కాలంలో హిందూ మతం లేదు’: కమల్ హాసన్

- Advertisement -
- Advertisement -

Kamal Haasan

దర్శకుడు వెట్రిమారన్‌కు కమల్ హాసన్ మద్దతు

చెన్నై: ‘రాజ రాజ చోళన్’ హిందూ రాజు కాదని దర్శకుడు వెట్రిమారన్ చేసిన ప్రకటనకు నటుడు, రాజకీయవేత్త కమల్ హాసన్ మద్దతు పలికారు.  చోళుల కాలంలో ‘హిందూ మతం’ అనే పదం ఉండేదే కాదని అన్నారు. కాగా బిజెపి చోళ రాజును హిందూ రాజుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే వారు తిరువళ్లువార్ ను కాషాయికరించారని ఆరోపించారు. రాజ రాజ చోళుని కాలంలో హిందూ మతం అన్న పదమే ఉండేది కాదని…వైష్ణవం, శివం, సమానం అనే మతాలే ఉండేవన్నారు. వీటన్నిటినీ కలిపి ఏ మతమో తెలియక ఆంగ్లేయులు ‘హిందూ మతం’ అనే దాన్ని తెచ్చారన్నారు. తూతుకుడి కాస్తా టుటీకొరిన్ గా ఎలా మారిందో ఇది కూడా అలాగే మారిందన్నారు. రాజ రాజ చోళన్ తో ప్రేరణ పొందిన దర్శకుడు వెట్రిమారన్ కల్పిత నవల ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్-1’ సినిమా రూపొందించారని తెలిపారు. ఆ సినిమా విడుదలైన మరునాడే దర్శకుడు వెట్రిమారన్ వివాదస్పద స్టేట్మెంట్ ఇచ్చారు. రాజ రాజ చోళన్ హిందూ రాజు కాదన్నారు. దానికి కమల్ హాసన్ మద్దతు పలికారు. కాగా బిజెపి మాత్రం రాజ రాజ చోళన్ హిందూ రాజని గట్టిగా వాదిస్తోంది. దీంతో మరో వివాదం ఇప్పుడు రాజుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News