Friday, November 22, 2024

ఇమ్రాన్‌ను బహిరంగంగా ఉరి తీయాలి : రజా రియాజ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బహిరంగంగా ఉరి తీయాలని పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ లోని విపక్ష నేత రజా రియాజ్ అహ్మద్ ఖాన్ సోమవారం వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌కు బెంయిల్ మంజూరు చేయడంపై కోర్టులను విమర్శించారు. కోర్టులు తమకు అల్లుడిలా స్వాగతం పలికాయని వ్యాఖ్యానించారు. జ్యుయిష్ ఏజెంట్ అయిన ఇమ్రాన్ ఖాన్ అంటే జడ్జిలకు ఆనందం అయితే వారు ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ లో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోరాటం చేయాలని,

ఆ జడ్జీల స్థానంలో పేదలకు న్యాయం చేసే వారిని నియమించాలని రజా రియాజ్ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇమ్రాన్ మద్దతుదారులు సాగించిన హింసాత్మక సంఘటనల గురించి మాట్లాడుతూ యావత్తు శాసన సభ, దేశం దీనికి సిగ్గు పడుతుందని వ్యాఖ్యానించారు.ఇమ్రాన్‌ఖాన్ కేసుల్లో ఇటీవల అనేకసార్లు న్యాయస్థానం ఊరట కలిగించాయని నిరసిస్తూ సుప్రీం కోర్టు బయట అధికార సంకీర్ణ కూటమి నిరసన ప్రదర్శన నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News