Thursday, October 24, 2024

వింటేజ్ లుక్ అదిరింది

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘రాజా సాబ్‘. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ‘రాజా సాబ్‘ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది.

బుధవారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ‘రాజా సాబ్’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘రాజా సాబ్‘ మోషన్ పోస్టర్ ను యూనిక్ గా డిజైన్ చేశారు. ఒక అడవిలో నడిచి వెళ్తున్న వ్యక్తి పెద్ద భవంతికి చేరుకుంటాడు. అక్కడ సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న రాజా సాబ్ ను మోషన్ పోస్టర్‌లో పరిచయం చేశారు. చేతిలో సిగార్, సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్‌తో ప్రభాస్ రాజా సాబ్ క్యారెక్టర్ వింటేజ్ లుక్ అదిరిపోయింది.

మోషన్ పోస్టర్ కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ చేసిన రాజా సాబ్ థీమ్ సాంగ్ ఆకర్షణగా నిలుస్తోంది. హారర్ ఈజ్ ది న్యూ హ్యూమర్ అనే క్యాప్షన్ మోషన్ పోస్టర్ చివరలో వేయడం ద్వారా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే హారర్ ఫ్లస్ కామెడీ ‘రాజా సాబ్’లో ఉండబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ‘రాజా సాబ్‘ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ‘రాజా సాబ్‘ చిత్రీకరణ తుది దశలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News