Monday, April 14, 2025

3డి వర్షన్‌లోనూ ‘రాజా సాబ్’

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్’. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ‘రాజా సాబ్‘ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈపాటికే థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలకావాల్సింది. కానీ ఇంకా పలు పనులు పెండింగ్ ఉండటంతో వాయిదా పడింది. ఇక ఈ చిత్రంపై మరో ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం ది రాజా సాబ్ సినిమా ఐమ్యాక్స్ వర్షన్ సహా థియేటర్స్‌లో 3డి వర్షన్‌లో కూడా విడుదల అవుతుందని సమాచారం. దర్శకుడు మారుతీ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌కి పెద్ద పీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News