Saturday, December 28, 2024

బుల్లెట్ పై రాజాసింగ్, అంబాసిడర్ పై వచ్చి పోచారం నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

నామినేషన్ల దాఖలులో కొందరు అభ్యర్థులు మందీమార్బలంతో వచ్చి ఆర్భాటంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరికొందరు చడీచప్పుడు లేకుండా నామినేషన్లు వేసి వస్తున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ శనివారం బుల్లెట్ పై వెళ్ళి నామినేషన్ వేశారు. ఆయన వెంట వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు ఆపేయడంతో,  నలుగురైదుగురు అనుచరులతో ఎన్నికల రిటర్నంగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లి రాజాసింగ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు ఆయన ధూల్ పేటలోని ఆకాశపురి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.

Raja Singh And Pocharam Files Nominationఇక బాన్స్ వాడ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన పాత అంబాసిడర్ కారులో వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన 1994నుంచీ తనకు అచ్చొచ్చిన అంబాసిడర్లోనే వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతోంది. అప్పటినుంచీ పోచారం ఎనిమిదిసార్లు అసెంబ్లీకి పోటీ చేసి, ఏడుసార్లు విజయం సాధించారు. అభ్యర్థులు హుందాగా ప్రవర్తించాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News