Thursday, January 23, 2025

ముస్లింల సోషల్ మీడియా అకౌంట్లపై రాజా సింగ్ ఆదేశం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముస్లిం రాజకీయ నాయకులు, మేధావుల సోషల్ మీడియా ఖాతాల గురించి తెలిపి, వారిని బ్లాక్ చేయాలని సస్పెండయిన బిజెపి ఎంఎల్‌ఏ టి. రాజా సింగ్ తన అనుచరులకు పిలుపునిచ్చారు. శనివారం విడుదల చేసిన వీడియో సందేశంలో, రాజాసింగ్ మాట్లాడుతూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలోని సోషల్ మీడియా ఖాతాల గురించి కంపెనీలకు పదేపదే ఫిర్యాదు చేయడం ద్వారా బ్లాక్ చేయడానికి కొంత మంది వ్యక్తులు కుట్ర పన్నారని, అమలు చేస్తున్నారని అన్నారు.
‘వారు(ముస్లింలు) సోషల్ మీడియాలో మా ఖాతాలను బ్లాక్ చేస్తున్నప్పుడు లేదా సస్పెండ్ చేస్తున్నప్పుడు, మనం కూడా అలాగే చేయాలి. ముస్లిం నాయకులు, మేధావుల అన్ని ఖాతాలు, ఛానెళ్లు, పేజీలను బ్లాక్ చేయమని నేను మీ అందరినీ కోరుతున్నాను’ అని ఆయన తెలిపారు.

ఒక వారం క్రితం రాజా సింగ్ యూట్యూబ్ ఛానెల్ ‘శ్రీ రామ్ ఛానెల్ తెలంగాణ’ ద్వేషపూరిత ప్రసంగ పాలసీ విధానాలను ఉల్లంఘించిందని గుర్తించడం జరిగింది. నిషేధించే సమయానికి ఈ ఛానెల్‌కు 5.5 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. అందులో వేయి వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News