Wednesday, January 22, 2025

మళ్లీ బుక్కయిన ఎంఎల్‌ఏ రాజా సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సస్పెండయిన బిజెపి ఎంఎల్‌ఏ టి. రాజా సింగ్ శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా విద్వేష ప్రసంగం చేసినందుకు మళ్లీ బుక్కయ్యాడు. ఐపిసి సెక్షన్లు 153ఎ, 506 కింద అతడిపై కేసులు పెట్టారు. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జె. వీర బాబు మార్చి 30న ఫిర్యాదు దాఖలు చేశారు. శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తాను, ఇతర సిబ్బంది సిద్దింబర్ బజార్‌లో బందోబస్తు విధుల్లో ఉన్నామని, అప్పుడు రాజా సింగ్ శోభాయాత్ర సిద్దింబర్ బజార్ ప్రాంతానికి చేరుకుందని, అక్కడ ఆయన హిందీలో విద్వేష ప్రసంగం చేశారని ఆరోపించారు. రాజా సింగ్ ‘లవ్ జిహాద్’ గురించి, పోలీసుల వైఖరి గురించి రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారని పేర్కొన్నారు. ప్రసంగ సందర్భంగా తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని రాజా సింగ్ అన్నారు.

రాజాసింగ్ ప్రసంగం అంతా వీడియో కెమెరా ద్వారా రికార్డు చేశారు. ‘న్యాయ నిపుణుల నుంచి సలహా తీసుకున్నాము’ అని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రవీందర్ రెడ్డి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రవక్త(స) మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ మీద ఇదివరకే కేసు ఉంది. అతడిని పిడి యాక్ట్ కింద ఇదివరకే హైదరాబాద్ పోలీసులు లోపల తోశారు. కానీ రాజాసింగ్ కండిషన్డ్ బెయిల్‌పై బయటికి వచ్చారు. బిజెపి కూడా అతడిని సస్పెండ్ చేసింది. ‘వెనుకటి గుణమేలా మానురా…’ అన్న చందంలా ఉంది రాజా సింగ్ ప్రవర్తన.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News