- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో హిందూమతం సేఫ్‌గా ఉండాలంటే బిజెపి ప్రభుత్వం అవసరం ఉందని ఎంఎల్‌ఎ రాజాసింగ్ తెలిపారు. సొంతపార్టీ నేతలపై ఎంఎల్‌ఎ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిజెపి ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికిపోవాలన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా సమావేశమవుతున్నారని రాజాసింగ్ దుయ్యబట్టారు. రహస్య సమావేశాలు పెట్టుకుంటే తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తుందా? అని అడిగారు. జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలని, గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్‌మెంట్ ఇస్తేనే బిజెపికి మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తానొక్కణ్నే కాదు అని, ప్రతి బిజెపి నాయకుడు, కార్యకర్తలు కోరుకుంటున్నారని రాజాసింగ్ చురకలంటించారు.
- Advertisement -