Thursday, January 9, 2025

నాకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

MLA-Raja-Singh

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని అన్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా తనను ఉగ్రవాదులు చంపుతారని చెప్పారు. ఇక, గతంలో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినట్టుగా రాజాసింగ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఇక, ఈ ఏడాది జూన్‌లో కూడా రాజాసింగ్ తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తెలియని ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో 80000 పైగా జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లుగా రాజాసింగ్ చెప్పారు. ‘మేము జెండాతో ప్రతి ఇంటికి చేరుకుంటాం. ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఆగస్తు 13 నుండి 15 వరకు వారి నివాసంలో జెండా ఎగురవేయమని వారిని అభ్యర్థిస్తాం’ అని రాజాసింగ్ ట్వీట్ చేశారు.

Raja Singh Complaints Police over terrorists threat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News