Sunday, December 22, 2024

బిజెపి తొలి జాబితాపై సస్పెన్షన్ ……

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి జాబితాపై సస్పెన్షన్ నెలకొంది. తాండూరు స్థానంలో కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఖరారు చేయనున్నారు. పోటీకి కొండా ససేమిరా అంటున్నారు. మాజీ మంత్రి వివేక్ ధర్మపురిలో పోటీ చేస్తానని చెబుతుండడంతో చెన్నూరు నుంచి వివేక్ పోటీ చేయించాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నానని యెండల లక్ష్మీనారాయణ చెబుతుండగా బోధన్ నుంచి యెండలను పోటీ చేయించాలని ఎంపి అరవింద్ పట్టుబడుతున్నారు. గోషామహల్ నుంచి కాకుండా ఎంఐఎం పోటీ చేసే స్థానంలో రాజాసింగ్‌ను పోటీ చేయించాలని యోచన ఉన్నట్టు సమాచారం. కార్వాన్ లేదా మలక్‌పేట్ స్థానంలో రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై తర్జనభర్జనలు చేస్తున్నారు. స్థానాల మార్పుపై క్లారిటీ వచ్చాకే తొలి జాబితా విడుదల చేయాలని బిజెపి భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News