Monday, December 23, 2024

ప్రాణం పోయినా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లను: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

తన ప్రాణం పోయినా భారతీయ రాష్ట్ర సమిత(బిఆర్ఎస్), కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లనని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇటీవల రాజాసింగ్ బిజెపికి గుడ్ బై చెప్పి, పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాజాసింగ్ స్పందిస్తూ.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.

“నేను చచ్చినా సెక్కులర్ పార్టీలోకి వెళ్లను. నా ప్రాణం పోయినా భారాస, కాంగ్రెస్ పార్టలోకి పోను. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయటమే నా లక్ష్యం. బిజిపి టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తా. స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేయను. గోషామహల్ బిఆర్ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉంది. మజ్లిస్ నిర్ణయం కోసమే గోషామహల్ పెండింగ్ పెట్టారు. బిజెపి అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయంలో నాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారు” అని పేర్కొన్నారు.

Also Read: మళ్లీ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: విజయశాంతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News