హైదరాబాద్: గోషామహల్ ఎంఎల్‌ఏ టి. రాజాసింగ్ శుక్రవారం తన పాడైపోయిన బుల్లెట్‌రెసిస్టెన్స్ వాహనాన్ని మార్చమని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆయన గురువారం తన ఇంటికి ఆ వాహనంలో వెళుతున్నప్పుడు మంగళ్‌హాట్ వద్ద ఒక టైరు పాడైపోయింది. కాగా ఆయన తన వాహనంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రెసిడెన్స్ క్యాంప్ అయిన ప్రగతి భవన్‌కు వచ్చి ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి పోయారు. ఆయన వెళ్లిపోతున్నప్పుడు పోలీసులు ఆయన్ని నిర్బంధించి తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తర్వాత ఆయన్ని తెలంగాణ శాసన సభ వద్ద వదిలిపెట్టారు.
ప్రస్తుతం ఆ బిజెపి ఎంఎల్‌ఏ బెయిల్‌పై ఉన్నారు. ఆ బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. ప్రవక్త(స)పై వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ని పిడి చట్టం కింద జైలులో పెట్టారు. అయితే హైకోర్టు దానిని కొట్టేసి ఆయనకు బెయిల్ ఇచ్చింది.
రాజాసింగ్ వాహనానికి ఇదివరలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో ఆయన దాన్ని రిపెయిర్ చేయించారు. ఆ తర్వాత ఆ వాహనాన్ని మార్చి వేరే ఇవ్వమని ఆయన డిమాండ్ చేశారు. రాజాసింగ్‌కు రోజంతా 2+2 రక్షణ, బిఆర్ వాహనాన్ని ఇచ్చారు.