Saturday, December 21, 2024

తెలంగాణను నడపాలంటే ఆ పార్టీతోనే సాధ్యం: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ పార్టీపై బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని జోస్యం చెప్పారు. రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసిఆర్ నే ప్రజలు మార్చేశారని రాజాసింగ్ అన్నారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కెసిఆర్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారు. పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. కెసిఆర్ చేసిన అప్పులు పూడ్చడంతోనే కాంగ్రెస్ సరిపోతుందన్నారు. తెలంగాణను నడపాలంటే ఒక్క బిజెపితోనే సాధ్యం అన్నారు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News