Wednesday, January 22, 2025

కాంగ్రెస్ వల్లే వక్ఫ్ భూములు పెరిగాయి: రాజా సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్‌సభలో గురువారం  ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుపై గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.

9.40 లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ నియంత్రిస్తోందని పేర్కొంటూ… దేశంలోనే మూడో వంతు అతిపెద్ద భూమిని వక్ఫ్ బోర్డు కలిగి ఉందని రాజా సింగ్ ఆరోపించారు. బిల్లుకు మద్దతు ఇస్తూ… ముస్లింలు, హిందువులకు చెందిన భూములను వక్ఫ్ ఆక్రమించిందని ఆరోపిస్తూ, వక్ఫ్ చట్టాన్ని సవరించాల్సిన ప్రాముఖ్యత ఉదని నొక్కి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ మద్దతు వల్లే వక్ఫ్ భూములు 4 లక్షల ఎకరాల నుంచి 9.4 లక్షల ఎకరాలకు పెరిగిపోయాయని ఆరోపించారు. లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుపై తీవ్ర చర్చల తర్వాత పార్లమెంటు సంయుక్త కమిటీకి సిఫార్సు చేయబడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News