వాషింగ్టన్: ఇండో అమెరికన్ వ్యోమగామి జె చారిని అధ్యక్షుడు బైడెన్ యూఎస్ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్‌గా నామినేట్ చేశారు. రాజా చారి నామినేషన్‌ను సెనెట్ ధ్రువీకరిచాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ కల్నల్ చారి బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్‌కు నామినేట్ అయినట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా బ్రిగేడియర్ జనరల్ (బిజి) స్టేట్స్ ఎయిర్‌ఫోర్స్‌లో వన్ స్టార్ జనరల్ ఆఫీసర్ ర్యాంకు.
ఈ ర్యాంక్ కల్నల్ కంటే అధికంగా మేజర్ జనరల్ కిందిస్థాయిలో ఉంటుంది. చారి ప్రస్తుతం టెక్సాస్‌లోని స్పేస్ సెంటర్‌లోని నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌లో క్రూ 3 కమాండర్, వ్యోమగామిగా పనిచేస్తున్నారు. చారి కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ 461వ ఫ్లైట్ టెస్టు స్క్వాడ్రన్ కమాండర్‌గా, ఎఫ్35 ఇంటిగ్రేటెడ్ టెస్టుఫోర్సు డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా చారి తన కెరీర్‌లో 2500గంటల కంటే ఎక్కువసేపు విమానయానంలో గడిపారు.