Sunday, January 19, 2025

భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలు గెలిచామని, పార్లమెంటు కూడా గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడికి ఒక అన్నగా తోడుగా ఉంటానని పేర్కొన్నారు. భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. భువనగిరి పార్లమెంట్ టికెట్‌ను కోమటి రెడ్డి కుటుంబం ఆశించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రేవంత్ రెడ్డి వర్గీయుడి పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. చామల కిరణ్ కుమార్ రెడ్డికి కోమటి రెడ్డి బ్రదర్స్ సహకరిస్తారా? లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. భువనగిరి పరిధిలో చామల ఎవరు పరిచయం లేకపోవడంతో పాటు బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అందరికి పరిచయం ఉండడంతో పాటు బిసి నేత కావడంతో గట్టి పోటినిచ్చే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి భువనగిరి స్థానం గెలుపుపై కీలక సమావేశం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌తో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News