Tuesday, December 24, 2024

దాని కోసమే పార్టీ మారినట్టు నిరూపించు: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Rajagopal reddy comments on Revanth Reddy

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంఎల్ఎ పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలపై ఆయన రీకౌంటర్ ఇచ్చారు. కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారినట్టు దమ్ముంటే నిరూపించాలన్నారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. లేదంటే టిపిసిసికి రాజీనామా చేస్తావా? అని అడిగారు. పిసిసి అయ్యాక రేవంత్ ఇంటికి వస్తా అంటే… తానే వద్దు అన్ని చెప్పానని, జైలుకు వెళ్లి వచ్చినవాడు ఇంటికొస్తే మురికి అవుతుందని వద్దని చెప్పానన్నారు.

ఎవరినీ పండపెట్టి తొక్కుతవ్ అని మండిపడ్డారు. రేవంత్ ఉన్నది మూడు ఫీట్లు, నన్ను తొక్కుతావా? అని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా జిందాబాద్ కొట్టించుకుంటావని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌ను తెలంగాణ ప్రజలు సిఎంగా ఒప్పుకుంటారా? అని నిలదీశారు. హుజురాబాద్ వెళ్లి ఏం చేశావు? అని ప్రశ్నించారు. మునుగోడుకు రేవంత్ వస్తే డిపాజిట్ కూడా దక్కదన్నారు. పిసిసి పదవి రేవంత్ డబ్బులతో కొన్నాడని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ప్లాన్ ప్రకారం టిడిపిని ఖతంచేశావని, పిసిసి ప్రెసిడెంట్ అయ్యి తెలంగాణను రేవంత్ దొచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపికి రేవంత్ రాజీనామా చేసి చంద్రబాబుకు ఇచ్చారని, స్పీకర్ ఇవ్వలేదన్నారు. ఉప ఎన్నికకు భయపడి, ఉత్తుత్తి రాజీనామా చేశారని చురకలంటించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తాను ఎప్పుడు అవమానపర్చలేదని, సోనియాను బలిదేవత అన్నది రేవంత్ ఒక్కడేనని మండిపడ్డారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్ అని రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. రేవంత్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లావా? రేవంత్ ను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాపారస్థులను బ్లాక్ మెయిల్ చేస్తాడని, నువ్వు వ్యాపారం చేయకుండానే ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని? రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి అంటేనే బ్లాక్ మెయిలర్ అని ధ్వజమెత్తారు. జయశంకర్ సార్, కోదండరామ్‌ను తిట్టిన చరిత్ర రేవంత్ అని మండిపడ్డారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై కూడా విమర్శలు చేశారని, గతంలో వైఎస్‌ఆర్‌ను పావురాల గుట్టపై పావురమై పోయాడని రేవంత్ అన్నారని గుర్తు చేశారు. సోనియా గాంధీ, వైఎస్‌ఆర్‌ను తిట్టిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నానని, కొడంగల్‌లో ఓడిపోయావు…పాలమూరు ఎంపిగా ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. సీమాంధ్రుల ఓట్ల కోసం మల్కాజ్‌గిరిలో పోటీ చేశావన్నారు. కాంగ్రెస్‌లో పార్టీలోకి వచ్చి తమకే నీతులు చెప్తావా? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News