మునుగోడు: బిజెపి కుట్రతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మునుగోడు రణభేరి సభలో తమ్మినేని మాట్లాడారు. బిజెపి కుట్రలో భాగంగానే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడన్నారు. రూ18 వేల కాంట్రాక్టు కోసం రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడని దుయ్యబట్టారు. గత మూడు సంవత్సరాల నుంచి బిజెపితో రాజగోపాల్ రెడ్డి టచ్‌లో ఉన్నాడని అతడే చెప్పాడని, మూడేళ్ల నుంచి రాజగోపాల్ రెడ్డి బిజెపితో అక్రమసంబంధం పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. నమ్మకద్రోహం చేసిన రాజగోపాల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తప్పుడు సిద్ధాంతాలతో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఒక దుర్మార్గమైన పార్టీ అని, అనేక మతాలు, కులాలు కలిగి ఉన్న విశాలమైన దేశం మనదన్నారు. ఎంఎల్ఎలను కొనడానికి స్వామీజీలను వాడుకుంటుందని, ఎనిమిది రాష్ట్రాలలో ఎంఎల్ఎలను కొని ప్రభుత్వాలను పడగొట్టిన పార్టీ బిజెపి దుయ్యబట్టారు.
రాజగోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి: తమ్మినేని
- Advertisement -
- Advertisement -
- Advertisement -