హైదరాబాద్: అస్సాం సిఎం హేమంత్ బిశ్వ శర్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బిజెపి చూసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఒక కేంద్రమంత్రి రాష్ట్రానికి వచ్చి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టలేదని అనడం కరెక్టా అని మండిపడ్డారు. ఈ సమాజాన్ని విభజించి గొడవలు పెట్టాలని బిజెపి చూస్తుందని మండిపడ్డారు. ప్రజల్లో వైశామ్యాలన్ని తీసేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారన్నారు. రాహుల్ గాంధీ వేసుకున్న టీషర్ట్ పై బిజెపి నేతలు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిజెపి గాడ్సే సిద్ధాంతాన్ని నమ్ముతుందని, కాంగ్రెస్ గాంధీని దేవుడుగా పూజిస్తుందని తెలియజేశారు. ఏ పార్టీ అయినా భారత జోడో యాత్రను విమర్శిస్తే మీరే చిన్నవాల్లు అవుతారని దుయ్యబట్టారు. బిజెపి నేత రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిన వ్యక్తి అని, మీరు వెళ్లిపోయినందుకు మేము సంతోషంగా ఉన్నామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో శాశ్వతమైన శిలాఫలకం వేయబోతున్నామని, రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు కూడా ప్రజలు రెండోసారి గెలవనివ్వలేదని, రాజగోపాల్ రెడ్డికి రెండవసారి గెలిచిన చరిత్ర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజగోపాల్ రెడ్డికి రెండోసారి గెలిచిన చరిత్ర లేదు: సుధీర్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -