Monday, December 23, 2024

రేవంత్‌ను నమ్మేదెవరు: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బ్లాక్ మెయిల్ చేసి రేవంత్‌రెడ్డి ఇప్పుడు భాగ్యలక్ష్మిగుడి వద్ద ప్రమాణాలంటే నమ్మేదెవరని బిజెపి నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక పదవులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్నాడని.. అలాంటి వ్యక్తి ప్రమాణాలంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరి రేవంత్‌లా రాజకీయ వ్యభిచారం చేయలేదన్నారు. పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కోవడం, ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు.

మునుగోడులో బిజెపి గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పతనమవుతుందని, అందుకే నన్ను ఓడించేందుకు బిఆర్‌ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీని గెలిపించడం రాజకీయ వ్యభిచారం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక, మునుగోడులో నన్ను ఓడించేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేసి, రూ.18 వేల కోట్ల అమ్ముడు పోయానంటూ బిఆర్‌ఎస్ తో కలిసి దుష్ప్రచారం చేయడం రాజకీయ వ్యభిచారం కాదా అని ఆయన ప్రశ్నించారు. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయకపోతే రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. నేను దాఖలు చేయనున్న పరువు నష్టం కేసులో ఎప్పటికైనా రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News