Wednesday, January 22, 2025

రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి ఎదురుదెబ్బతగిలింది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు. రాజగోపాల్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు భావిస్తుండడంతో కాంగ్రెస్‌లో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. కెసిఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. గత సంవత్సరం బిఆర్‌ఎస్‌కు దూకుడుగా బిజెపి వ్యవహరించడంతో ఆ పార్టీలో చేరానని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు కొంత డీలా పడడంతో పార్టీ మారాల్సి వచ్చిందని రాజగోపాల్ చెప్పారు. తెలంగాణ ప్రజలకు అనుగుణంగానే తాను పార్టీ మారుతున్నానని వివరించారు. తాను ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదని, తెలంగాణ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News