Monday, December 23, 2024

స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని అందజేసిన రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Rajagopal reddy resigned his MLA post

హైదరాబాద్: మునుగోడు ఎంఎల్ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.  మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ్యత్వ రాజీనామా పత్రాన్ని సోమవారం శాసనసభ భవనంలోని ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారని ధీమావ్యక్తం చేశారు. తాను రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక పై ప్రజలు మాట్లాడుకుంటున్నారని వివరించారు. ఎందుకు ఉప ఎన్నిక వస్తోందో తెలుసుకోవాలని, స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరని,  మునుగోడు ప్రజల పై ఉన్న నమ్మకం తో రాజీనామ చేశానన్నారు. దైర్యం లేకపోతే తాను ఈ పని చేసే వాడిని కాదని,  తన పై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఇది తర కోసం చేసే యుద్ధం కాదని,  ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉందని కోమటి రెడ్డి తెలిపారు. స్పీకర్ తన రాజీనామాను ఆమోదిస్తారు అనుకుంటున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News