Friday, December 20, 2024

రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజలకు మేలు చేసే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్ బి నగర్ లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో హైదరాబాద్ లో నివాసముంటున్న  మునుగోడ్ నియోజకవర్గ పరిధిలో గల నాంపల్లి మండలానికి చెందిన ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి జరిగిందని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని కొనియాడారు. మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వలన వచ్చిందని మండిపడ్డారు. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు వచ్చిందని రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News