Wednesday, January 22, 2025

రాజగోపాల్ రెడ్డి బిజెపికి అమ్ముడుపోయారు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Rajagopal reddy sold to BJP

 

నల్లగొండ: రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్‌కు రాజగోపాల్ రెడ్డి బిజెపికి అమ్ముడుపోయారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య ఆస్తుల సవాళ్లు విసురుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్లు సంపాదించాడన్న రాజగోపాల్ రెడ్డి అన్న మాటకు మంత్రి రీకౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఇసి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంట్రాక్టులు తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నారా? అడిగారు. రాజగోపాల్ రెడ్డి దొరికిపోయిన దొంగ అని మండిపడ్డారు. బిజెపి పార్టీకి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలు కావడంతో పాటు మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న మూడున్నర ఏళ్లలో మునుగోడు అభివృద్ధి కుంటుపడిందన్నారు.  గత ఎన్నికలలో మునుగొడులో బిజెపి  12వేల ఓట్లు వచ్చాయని, బిజెపితో ఎందుకు చేరావని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో మూడో ఉపఎన్నికను కూడా గెలిచి హ్యట్రీక్ కొట్టి తిరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైతే మునుగొడులో కాంగ్రెస్ బలంగా ఉందని, మాకు పోటీ కాంగ్రెస్ పార్టీనేని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నికల వచ్చిన విషయం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News