Monday, December 23, 2024

రేపు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నేడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు నుంచే పోటీ చేస్తా
పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ లేదా కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి సిద్ధం
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేయగా శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. ఇందుకు గాను రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా గురువారం ఆయన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది.

ఈ భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మునుగోడు నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఈ విషయాన్ని అధిష్టానంకు చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ లేదా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. కెసి వేణుగోపాల్‌తో కూడా ఈ విషయంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. నేడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరనున్నట్లు ఆయన చెప్పారు. మునుగోడుతో పాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసేందుకు రాజగోపాల్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News