Wednesday, January 22, 2025

కిరోసిన్ దీపంతో చదివిన జగదీశ్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయి: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతలను దేవుడు కూడా కాపాడలేరని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేయాల్సింది చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది చేస్తుందని స్పష్టం చేశారు.  తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి శాసన సభలో మాట్లాడారు. బిఆర్‌ఎస్ రానున్న రోజుల్లో కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తుందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. తాను రాజీనామాలు చేసిన తరువాతే పార్టీలు మారానని స్పష్టం చేశారు. జగదీశ్ రెడ్డి ప్రస్టేషన్‌లో ఉన్నారని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. కిరోసిన్ దీపంతో చదివిన జగదీశ్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయని అడిగారు. జగదీశ్ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని,  మా అన్నదమ్ములపై జగదీశ్ అలా మాట్లాడడం సరికాదని రాజగోపాల్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News