అమరావతి: కాపాడాల్సిన కన్నతండ్రే కాటేశాడు. తండ్రి కూతురును చేయి పట్టుకొని ఆడిస్తే ఆ ఆనందానికి అవధులు అనేవి ఉండవు. ఇతరులు ఎవరైనా బెదిరిస్తే మా నాన్నకు చెబుతానని కూతురు హెచ్చరిస్తోంది. అలాంటిది తండ్రే కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….
రాజమండ్రిలో మూడో పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఓ వ్యక్తి(45) మెకానిక్‌గా పని చేస్తూ తన కూతురును పోషిస్తున్నాడు. ఓ మహిళను 2008లో ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు.
ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో తన కూతుళ్లతో కలిసి ఆమె తన పుట్టింటికి వెళ్లింది. పెద్ద కూతురు (15) గత మూడేళ్ల నుంచి తండ్రి వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి మద్యానికి బానిసగా మారి రాత్రి సమయంలో కూతురుపై పలుమార్లు అత్యాచారం చేశాడు. పాఠశాలలో బాలిక నిరుత్సాహంగా ఉండడంతో ఉపాధ్యాయురాలు గమనించారు. బాలికను ఓదార్చిన అనంతరం ఆమెతో చనువు తీసుకొని మాట్లాడారు. జరిగిన విషయం చెప్పడంతో ఉపాధ్యాయురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.