అమరావతి: 16 బాలిక, 20 ఏళ్ల యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. బాలిక మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుందని ఆమెపై ప్రియుడు అనుమానం పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ప్రియురాలు, ఆమె తల్లిని ప్రియుడు హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఏలూరులోని ఎఎస్‌ఆర్ స్టేడియంలో భర్త అబ్దుల్ రజీద్ మృతి చెందడంతో రెండో భార్య ఎండి సాల్మ(38) తన కూతురు సనా(16)తో కలిసి జీవిస్తోంది. అబ్దుల్ రజీద్ మొదటి భార్య ముగ్గురు కుమారులు రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. మూడు సంవత్సరాల క్రిత అబ్దుల్ చనిపోవడంతో బాలిక సనా ఈవెంట్స్‌లలో పాల్గొంటూ తల్లి చేదోడువాదోడుగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా నందిగామ్ మండలం కొత్త వీధికి చెందిన పిల్లా శివ కుమార్ సినిమాల్లో లైట్ బాయ్ పని చేస్తున్నాడు. సామర్లకొటలో జరిగిన ఈవెంట్‌లో సనాకు శివ పరిచయం కావడంతో ప్రేమగా మారింది.
గత ఆరు నెలల నుంచి ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. హుకుంపేట పంచాయతీ పరిధిలోని డిబ్లాక్‌లో ఓ అద్దె ఇంట్లో సనా తన తల్లితో కలిసి ఉంటుంది. మొదటి భార్య కుమారుడు ఉమర్ కూడా సాల్మతో కలిసి ఉంటున్నాడు. సనా మరో యువకుడితో పోన్‌లో మాట్లాడుతుందని శివ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం సనా ఇంటికి శివ వచ్చాడు. యువతి, యువకుడు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఉమర్ సర్దిచెప్పి వెళ్లిపోయాడు. ఉమర్ తిరిగి ఇంటికి వచ్చేసరికి సనా, ఆమె తల్లి రకప్తు మడుగు కనిపించారు. ఉమర్ స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన శివను కొవ్వూరు రోడ్డు-రైలు వంతెన సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. తానే హత్యచేశానని ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.