Friday, November 15, 2024

రాజయ్య ఇంటికి బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వరంగల్ బిఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత పార్టీని వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్ధమయ్యా రు. అసెంబ్లీ టికెట్ దక్కపోవడంతో బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య బిఆర్‌ఎస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీకి చేసిన రాజీనామా ను ఉపసంహరించుకోబోతున్నట్లుగా సమాచా రం. ఇప్పటికే రాజయ్యతో బిఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమావేశమైనట్లు తెలిసింది. శనివారం రాజయ్య నేరు గా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో భేటీ కానున్న ట్లు సమాచారం. ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. ఆయన మీద పోటీగా రాజయ్యను బరిలోకి దింపేందుకు బిఆర్‌ఎస్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే పార్టీలో చేరికపై తన కార్యకర్తలతో చర్చించి చెబుతానని రాజయ్య బిఆర్‌ఎస్ నేతలకు చెప్పినట్లు సమాచారం.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బిఆర్‌ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్‌లో చేరలేదు. మరోవైపు ఆయన రాజీనామాను కూడా కెసిఆర్ ఆమోదించలేదు. మరోవైపు అనూహ్యంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. తండ్రితో కలిసి ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. తన ప్రత్యర్థి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరనుండటంతో మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు రాజయ్య సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు వరంగల్ బిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాడికొండ రాజయ్యను ఎంపిక చేసారన్న ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News