Monday, November 18, 2024

రజక కులస్తులకు ఎల్లవేళలా అండగా ఉంటా

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో: రజక కులస్తులకు అన్నివిధాలా సహాయ సహకారాలందించడానికి ఎల్లవేళలా అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. ఆదివారం నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రజక జన సేవా సంఘం సభ్యులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే బిగాల పార్టీ కండువాలు కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండవర్గాలకు సముచిత న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి ఎంబిసి కులాలకు లక్ష చొప్పున సహాయం చేస్తున్నారని అన్నారని అన్నారు. రజక కులస్తులు మారుతున్న ఆధునిక విధానంలో తమ వృత్తి వ్యవహారాలు సైతం మారవలసిన అవసరముందన్నారు. రజకులు చెరువుకు వెళ్లి బట్టలు ఉతికే సంస్కృతి మారాలని ప్రభుత్వం ఆధునిక పద్ధితిలో దోబీఘాట్లను ఏర్పాటు చేస్తోందన్నారు.

నిజామాబాద్ నగరంలో ఇ న్యాల్కల్ రోడ్డులో రూ.2కోట్లతో మాడ్రన్ దోబీఘాట్‌లను నిర్మించడం జరుగుతుందని, త్వరలో దీని నిర్మాణానికి భూమిపూజ చేపడతామని అన్నారు. దోబీఘాట్‌లో మిషన్లతో పని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంపిసి కులాలకు బిసి గ్రాంట్ నుంచి ఒక కుటుంబానికి లక్ష రూపాయల సహాయం అందజేస్తున్నారని అన్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాలో గుంతల రోడ్లు ఉండేవని ప్రస్తుతం ఎంతో సుందరంగా రోడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజల పట్ల వారు పడుతున్న తపన సంక్షేమ పథకాలను చూసి , కులాల పట్ల చూపుతున్న ప్రేమ అభిమానానికి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సత్యప్రకాష్, రజక జన సేవా సంఘ అధ్యక్షుడు మాదారం సుదర్శన్, ప్రధాన కార్యదర్శి బగ్గలి అజయ్, ఉపాధ్యక్షులు మల్లెపూల గోపి, శేఖర్, జాయింట్ సెక్రెటరీ బగ్గలి కృష్ణ, మహిళ సభ్యులు భాగ్య, మానస, భూలక్ష్మి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News