Saturday, December 28, 2024

రజకుల ఆరాధ్య దైవం మడేలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా

- Advertisement -
- Advertisement -
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

చేర్యాల: రజకుల ఆరాధ్య దైవమైనటువంటి మడేలమ్మ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఆదివారం మడేలమ్మ ఆలయం వద్ద ఉన్న మత్తడి కాలువపై కప్పు వేసేందుకు తన సొంత నిధుల నుంచి రూ. 20 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ ఆవరణలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తామని, మున్సిపల్ పాలక వర్గం గుడికి వెళ్లే సిసి రోడ్డు నిర్మాణం కోసం అంచనా వ్యయం వివరాలు పంపిస్తే సిసి రోడ్డు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూపారాణి, ఎఎంసి చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ చైర్మన్ పుర్మా వెంకట్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్‌లు మంగోలు చంటి , ఆడేపు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News