Thursday, December 26, 2024

#SSMB నుంచి అప్డేట్.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను మించి ఉంటాయి: రాజమౌళి

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ఎస్‌ఎస్‌ఎంబి29’ వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తాజాగా రాజమౌళి ఓ అంతర్జాతీయ కార్యక్రమానికి హాజరై ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “మహేష్ బాబుతో తీస్తున్న ఈ సినిమాలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయి. నాకు జంతువులంటే ఇష్టం. ’ఆర్‌ఆర్‌ఆర్’తో సహా గతంలో నేను తీసిన సినిమాల్లో జంతువులను ఉపయోగించాను. ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కంటే ఎక్కువ జంతువులు నా తదుపరి చిత్రంలో ఉంటాయి” అని అన్నారు.

ఇక అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథ ఇదని సమాచారం. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని ఇటీవల కథా రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. దుర్గా ఆర్ట్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్‌బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో పాత్రకు తగ్గట్టు మేకోవర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News